వక్ఫ్ బిల్లును రద్దు చేయాలి : సీపీఐ నేత అందె అశోక్

వక్ఫ్ బిల్లును రద్దు చేయాలి : సీపీఐ నేత అందె అశోక్

చేర్యాల, వెలుగు : వక్ఫ్ బిల్లు  రద్దు చేయకుంటే బీజేపీపై యుద్దం తప్పదని సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యుడు అందె అశోక్  హెచ్చరించారు. దేశంలో మైనారిటీ ప్రజల హక్కులను కాలరాసే వక్ఫ్ సవరణ బిల్లును రాజ్యసభలో ఏకపక్షంగా ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ శనివారం పట్టణంలోని అంగడి బజార్ వద్ద రాజీవ్ రహదారిపై ముస్లింలతో కలిసి నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా ఏకపక్ష ధోరణితో వక్ఫ్ బోర్డు బిల్లును ఆమోదించడం అన్యాయమన్నారు.

 వెంటనే వక్ఫ్ బోర్డ్ బిల్లును ఉపసంహరించకపోతే భవిష్యత్​లో బీజేపీని తరిమికొడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మజీద్ కమిటీ అధ్యక్షుడు ఎంఏ ముఖిమ్, కార్యదర్శి ఎండీ ఆదిల్, భూమయ్య, యాదగిరి, సుదర్శన్,  నర్సయ్య,  శ్రీనివాస్, మౌలానా, నవాజ్, ఎండీ ఖాజా, నజీమ్, సబీర్, ఇమామ్  పాల్గొన్నారు.